శ్రీ సాయి
ఈరోజు శ్రీ సాయిబాబా వారికి ఒక ప్రత్యేక అలంకారంలో చూసారా...... ఈరోజు విశేషం తెలుసుకోవాలని ఉన్నదా......
*ఈరోజు రంగపంచమి షిర్డీలో జరిగే పండగలలో ఇది ఒక పండగ*
రంగపంచమి అనేది హిందూ పండుగ, ఇది హోలీ పండుగ అయిన ఐదు రోజుల తర్వాత జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ యొక్క ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం లోని 5వ రోజు ఈ పండుగను చేస్తారు. రంగురంగుల పద్ధతిలో జరుపుకుంటారు అది గులాం రంగు నీటిలో కలిపి చల్లుకోవడం. రంగ్ అనే పదం రంగు అని సూచిస్తుంది అయితే ఐదొవ రోజు సూచిస్తుంది దేశ వ్యాప్తంగా కొన్ని ప్రదేశాలలో హిందూ పురాణాలు ప్రకారం రంగు పంచమి ఆధ్యాత్మిక పురోగతికి అవరోధంగా విజయానికి ప్రతీక. ఇది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. బృందావనం మరియు మధుర దేవాలయాలలో పంచమి వేడుకలు హోలీ ఉత్సవాలతో ముగుస్తాయి.