కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెంగళూరు- మంగళూరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. కార్లు ఢీకొట్టి పల్టీలు కొట్టడంతో వాహనాల్లోని వారు తీవ్రంగా గాయపడ్డారు. కునిగల్ తాలూకా అమరితూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాడ్‌కేరే వద్ద ఉదయం 3.00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి నలుగురు యువకులు కారులో ధర్మస్థలికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం అమరితూరు వద్ద అదుపుతప్ప డివైడర్‌ను ఢీకొట్టింది.
డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టి తవేరాాను ఢీకొన్న కారు.. 13 మంది మృతి