ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్ సర్కార్‌కు ఎన్నికల వాయిదాపడింది. దీంతో ఏపీలో ఎటూ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి. దీంతో పాటు ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల్ని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ ను ఎత్తివేయాలని ఎలక్షన్ కమిషన్ కు సూచించింది. ఈసీ అనుమతితో కొత్త పథకాల అమలు చేపట్టవచ్చని సుప్రీం పేర్కొంది.
మరోవైపు అధికారులు కూడా ఈ పథకానికి సంబంధించిన లబ్దిదారుల ఎంపిక, ఇళ్ల స్థలాల ఎంపికను సైతం పూర్తి చేశారు. ఏపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రకటించింది. లబ్ధిదారులకు ఉచితంగా ఇచ్చిన ఇంటి స్థలాలను ఐదేళ్ల తరువాత అమ్ముకునే సౌలభ్యం కల్పించింది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఇళ్ల పట్టాల ద్వారా బ్యాంకుల నుంచి పావలా వడ్డీకే రుణాలు పొందవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇంట్లోని ఆడవాళ్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించనుంది. ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం బడ్జెట్ లో 8615 కోట్ల రూపాయలు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 99వేల మందికి 1.50 సెంటు ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో 31 వేల మందికి జీప్లస్ 3 ఇళ్లు, 40 వేల మందకి ఒక సెంటు ఇంటి స్థలం ఇస్తున్నట్లు సమాచారం. ఇంటి పట్టాలను లాటరీ పద్దతిలో కేటాయిస్తున్నారు.