తేదీ :21- 3-2020,
న్యూ ఢిల్లీ .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు నూతన మెడికల్ కళాశాలలు మంజూరు అందులో ఒక మెడికల్ కళాశాల పాడేరు ప్రాంతానికి - *అరకు ఎంపీ గొడ్డేటి. మాధవి*
- రాష్ట్రానికి మూడు నూతన మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తూ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం.
- ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతంగా గుర్తింపు ఉన్న పాడేరులో ఒక మెడికల్ కళాశాల కేటాయించడం వలన రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతానికి మరిన్ని మెరుగైన వైద్య సేవలు సమకూరుతాయి. అదేవిధంగా గిరిజన ప్రాంతం నుంచి డాక్టరేట్ పట్టభద్రులు వస్తారని తెలియజేశారు.
- 365 కోట్ల వ్యయంతో అధునాతనమైన పరికరాలతో నిర్మించబోతున్న వైద్య కళాశాలతో గిరిజన ప్రాంతం వైద్య రంగంలో మరో అడుగు ముందుకు వేసినట్టు అని తెలిపారు.