రాజకీయ పార్టీ పోటీ దారులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి...పాడేరు డిఎస్పీ రాజ్ కమల్.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీ నాయకులు, పోటీదారులు, వారి సహచరులు ఎన్నికల నిబంధలను తప్పనిసరిగా పాటించవలెను. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఈ నెల ఆఖరు వరుకు అమలు లో ఉంటుంది. రాజకీయ పార్టీలు గానీ, పోటీదారులుగానీ, ర్యాలీలు, బహిరంగ సభలు , సమావేశాలు, మైక్ ప్రచారాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి పోలిసుల నుండి మరియు రిటర్నింగ్ అధికారి నుండి Single window System ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. పోటీదారులు మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ (MCC) ను పాటించవలెను. నిబంధలను అతిక్రమించిన వారిపై చట్ట రీత్యా చర్యలు చేపట్టబడును. శాంతి భధ్రతలకు విఘాతం కల్గించకుండా వ్యవహరించి, పోలీస్ వారు మరియి ఇతర ఎన్నికల సిబ్బంది చేపట్టే చర్యలకు ప్రజలందరు సహకరించాలి. ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సమయం లో వారికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాయకులూ వ్యవహరించాలి. డబ్బు , నాటుసారా , మద్యం వంటివి పంపిణీ జరిగితే ఆ విషయాన్ని ప్రజలు ఎవరైనా సరే పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు.
పాడేరు సబ్ -డివిజన్ లో గల 313 పోలింగ్ బూత్ ల లోను ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి పోలీస్ శాఖ తగు చర్యలు చేపట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంధ్రాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల లో గల పోలింగ్ కేంధ్రాలను గుర్తించి వాటికీ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడమైనది. స్థానిక పోలీస్ బలగాలకు అదనంగా కేంద్ర సాయుధ బలగాలు, గ్రేహాండ్స్ పార్టీలు, ముమ్మరంగా కూoబింగ్ నిర్వహించి ప్రజలు వారి ఓట్ హక్కు ను నిర్భయం గా వినియోగించుకొనే విధంగా ఏర్పాట్లు చేయడమైనది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ డ్రోన్లు , ధర్మల్ స్కానర్, satellite images సహాయంతో మావోయిస్టుల వల్ల ప్రజాస్వామ్య ఎన్నికలకు ఆటంకం కలగకుండా చర్యలు చేపడుతున్నాము . పోలీస్ శాఖ ఎల్లవేళలా గిరిజనలకు అండగా ఉంటుంది. గిరిజనలందురూ నిర్భయం గా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
డా. వి.బి.రాజ్ కమల్ డిఎస్పీ, పాడేరు.
డా.వి.బి.రాజ్ కమల్ డిఎస్పి పాడేరు