లోక్డౌన్  కారణంగా మారుమూల గిరిజన ప్రాంతంలో ప్రజలకు నిత్యవసర వస్తువులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు


 లోక్డౌన్  కారణంగా మారుమూల గిరిజన ప్రాంతంలో ప్రజలకు నిత్యవసర వస్తువులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే గిరిజన గ్రామాల్లో మొబైల్ వాన్ ద్వారా నిత్యావసర సరుకులు, కూరగాయలు సరఫరా చేయవలసిందిగా గా సీఐటీయూ  జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నది గత పదిహేను రోజులు గా కరోన కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ మూలంగా వారపు సంతలు జరగక ఏజెన్సీ ప్రాంతంలో మారు మూల ప్రాంత ప్రజలకు నిత్యావసర వస్తువులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో రక్త హీనతతో భాద పడుతుంటే ఏ పోషకాహారం లేక ఇంకా ప్రజలు జబ్బున పడే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ కూరగాయలు , నిత్యావసర సరుకులు అందడం లేదు. ప్రభుత్వం రేషన్ డిపో ల ద్వారా బియ్యం, కంది పప్పు మాత్రమే సరఫరా చేస్తున్నది. గిరిజనులకు వారపు సంతలు నిత్యావసర వస్తువుల కొనుగోలు కు ఆధారం. కూరగాయలు ఇతర వస్తువులు గిరిజనులకు అందకపోతే వారి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది. 
కావున ఐ.టి.డి.ఏ. అధికారులు దీనిని దృష్టిలో ఉంచుకుని , మొబైల్ రైతు బజారులను ఏర్పాటు చేసి మారు మూల గిరిజన గ్రామాలకు నిత్యావసరాలు సరఫరా చేసే ఆదుకోవాలని కోరుతుంది.
ఇట్లు 
ఆర్.శంకర్ రావు
సీఐటీయూ, జిల్లా అధ్యక్షుడు