sundruputtu గ్రామ శ్రీ సీతారామ అలయకమిటి తెలియజేయునది ఏమనగా.
పత్రిక శ్రేయోభిలాషులకు పాడేరు మండలం sundruputtu గ్రామ శ్రీ సీతారామ అలయకమిటి తెలియజేయునది ఏమనగా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా "కరోనా వైరస్" వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తేదీ 26-03-2020 గురువారం దినమున ముగ్గురు ముత్తయిదువులతో మాత్రమే పందిరి రాట వేస్తూ . తేదీ 01-04-2020 నుండి 03- 04 2020 వరకు జరగబోయే శ్రీరామ నవమి ఉత్సవాలను నిరవధికంగా విరమించుకుంటు రద్దుచేయడమైనది కేవలం తేదీ 02-04-2020 గురువారం దినమున భక్తుల విశ్వాసాలు ,నమ్మకాలు దెబ్బతినకుండా ఎటువంటి ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా పూజరితో మాత్రమే పూజా కార్యక్రమం నిర్వహింప దలిచాము ఉత్సవ కమిటీ సేకరిస్తున్న విరాళాలు నిలుపుదలచేయిస్తూ ఇప్పటివరకు సేకరించిన విరాళాలు స్వచ్చంధ చందాదారులు ఇచ్చిన సొమ్మును ఆలయ అభివృద్ధికి కేటాయిస్తూ పాడేరు ఆంధ్రబ్యాంకు నందు ఖాతా తెరిచియున్న ఆలయ కమిటీ అకౌంట్ లో జమ చేస్తున్నట్లు ప్రజలకు, భక్తులకు, విరాలధాతలకు అలయకమిటి అధ్యక్షులు దన్నేటి పలాసి సురేష్ ప్రధాన కార్యదర్శి జవ్వాది బాబురావు తెలియజేస్తూ ఈ సందర్బంగా కరోనా వైరస్ దరి చేరకుండా మనల్ని మనమే కాపాడుకోవాలంటే వ్యక్తికి వ్యక్తికి మీటరు దూరం పాటించాలని గుంపులుగా ఉండకుండా . శానిటేషన్ , మాస్కులు వాడాలని పేర్కొంటూ తెలియజేయడమైనది.