కరోనా..పో" అంటూ గృహంలో పూజలు

"కరోనా..పో" అంటూ గృహంలో పూజలు
-------------------------------------------
విశాఖపట్నం:ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ని గజ గజ లాడిస్తున్న కరోనా వైరస్ నివారణకు దేశవ్యాప్తంగా మార్చి 22 న జనతా కర్వ్యూ లో దేశ ప్రజలందరూ పాల్గొని సంఘీభావం ప్రకటించారు
ఇంటిలోంచి బయటకు రాకుండా కర్ఫ్యూ పాటించి కరోనా నివారణకు సహకారాన్ని అందించాలని ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు ప్రజలందరూ ఎవరింటిలో వారు టి వి లు చూస్తూ...సెల్పోనుల్లో టిక్ టాక్ లు చూస్తూ..బంధువులకు వీడియో కాల్స్ చేస్తూ ఎవరి ఇష్టపూర్వకంగా వారు ఉన్నారు 
అదే సమయంలో విశాఖపట్నం.కలెక్టర్ ఆపీస్ దరి కృష్నా నగర్ లో ఉంటున్న విధి విలాసం మాసపత్రిక అధినేత చింతా ప్రభాకరరావు కుమారుడు  భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు చింతా నేతాజీ కుటుంబ సమేతంగా శివ పూజలో నిమగ్నమయ్యారు.ఆ పూజ  పరమార్థం ఈశ్వరానుగ్రహం ఆ కుటుంబానికి కావాలని కాదు
మహమ్మారి కరోనా ప్రపంచం విడిచి పోవాలని.
ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు ననుసరించి తమ ఇంటిలోనే శివపూజ నిర్వహించి శంఖం పూరించి "పో..కరోనా..పో ఈ ప్రపంచాన్ని విడిచిపో అంటూ పూజాఅనంతరంకూడా శివునికి పుస్పార్చన గావిస్తూ 108 సార్లు శంఖం పూరించి కరోనా పో అంటూ నేతాజీ కుటుంబ సభ్యులు ముక్త కంఠంతో పలికారు.