హనుమాన్ జంక్షన్ లో జర్నలిస్టులపై దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ విశాఖ శాఖ తీవ్రంగా ఖండించింది.

 


జర్నలిస్టుల పై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
....
హనుమాన్ జంక్షన్ లో జర్నలిస్టులపై దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ విశాఖ శాఖ తీవ్రంగా ఖండించింది. ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులను భారత ప్రధాని కొనియాడిన దశలో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించడం అత్యంత పాశవికంగా వ్యవహరించారని యూనియన్ నగర అధ్యక్షులు రావుల రామచంద్రరావు విమర్శించారు. దీనికి బాధ్యులైన పోలీస్ సిబ్బంది. అధికారులను వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల విశాఖ శాఖ డిమాండ్ చేసింది. ఈరోజు కరోనా నియంత్రణలో విధులు నిర్వర్తిస్తున్న అన్ని శాఖల్లో ఉద్యోగులు ఎంతో కొంత నిర్దిష్ట వేతనాలు తీసుకుంటున్నారు. కానీ జర్నలిస్టులు చాలామంది పరిమిత వేతనాల తోనే ఈ సమాజం కోసం పని చేస్తున్నారు. కుటుంబ జీవితాలను పక్కనపెట్టి ఈ కరోనా నియంత్రించడానికి ప్రపంచ దేశాలు ఆశిస్తున్నా విజయం కోసం జర్నలిస్టులు పని చేస్తుంటే అధికార గర్వంతో కొందరు పోలీసులు చేసిన ఈ దాడి పూర్తిగా పోలీస్ శాఖ కు అవమానం గా మారింది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం విచారణ జరిపిస్తారని..బాధ్యులైన పోలీస్ అధికారులపై వెంటనే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ విశాఖ శాఖ అధ్యక్షుడు రావుల వలస రామచంద్రరావు... ప్రధాన కార్యదర్శి కే చంద్ర మోహన్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు