"శ్రీ షిర్డీ సాయి ధ్యాన మందిరం కంచరపాలెం
(సిటీ ట్రెండ్ న్యూస్ విశాఖపట్నం)
కరోనా మహమ్మారి దేశమంతటా తీవ్రంగా విస్తరిస్తుండడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో ప్రజలు ఎవ్వరూ బయటకు రావడం లేదు. దీంతో చాలా పేద కుటుంబాలు ఒక్క రోజు పొట్ట నింపుకొవటనికి చాలా ఇబ్బంది పడుతున్నారు.
అటువంటి వారికి తమవంతు సహాయం చేసేందుకు కంచరపాలెం,NH-5 లో వెలసిన *"శ్రీ షిర్డీ సాయి ధ్యాన మందిరం"* ఆలయ కమిటీవారు _'సత్యసాయి బాబా వర్ధంతి'_ సందర్భంగా 100 మంది పేద GVMC కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మరియు సుబ్బలక్ష్మీ కల్యాణ మండపం దగ్గర షెడ్సలో నివసిస్తున్న 230 పేదవాళ్ళకు గుడ్లు, 3 రకాల పండ్లు అందించారు. ప్రతి ఒక్కరూ తమ చేతనైనంత సహాయం చేయాలని ఆలయ ప్రెసిడెంట్ పోలరాజు , అలయ కమిటి రామచంద్రరావు, సురేష్ పాల్గొన్నారు.