మన్యంలోరూ.100కోట్లతోపసుపుసాగుచేపడుతున్నామనిసమీకృతగిరిజనాభివృద్ధిసంస్ధప్రాజెక్ట్అధికారి డి.కె.బాలాజీ స్పష్టం చేశారు.
(సిటీ ట్రెండ్ న్యూస్ -మన పాడేరు)
పసుపు ప్రధాన వాణిజ్య పంటగా అభివృద్ది చెందాలన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయం నుంచి వ్యవసాధికారులు, ఉద్యానవన అధికారులు, వ్యవసాయశాఖ సహాయకులు, ఉద్యానవన సహాయకులులతో పసుపుసాగు విస్తరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం పరిధిలోని పసుపుసాగు పై ఆసక్తి కలిగిన రైతులను గుర్తించాలని సూచించారు. స్వల్పకాలిక పసుపు విత్తనాలు ప్రగతి, ప్రతిభ, రోమా రకాలను రైతులకు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ ఏడాదినుంచి ప్రోజెక్టు ప్రారంభించి 5 ఏళ్ల అమలు చేస్తామని అన్నారు. మొదటి ఏడాది 2వేల ఎకరాల్లో సాగు చేస్తామన్నారు. రైతుకు రూ 32 వేల విలువైన పసుపు విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. ఎకరాకు ఏడువందల కిలోల విత్తనాలు అవసరమని పేర్కొన్న అయన రైతు వంతుగా రూ.3360 లు డిడి రూపంలో ఐటీడీఏ కు చెల్లించవలసి ఉంటుందన్నారు. గిరిరైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీఓ జనరల్ వి.ఎస్.ప్రభాకర్. పి.హెచ్.ఓ జి.ప్రభాకర్ రావు వ్యవసాయ శాఖ ఏ డి లు.ఏ.వోలు తదితరులు పాల్గొన్నారు.