పలు ప్రాంతాల్లో 1000 కేజీలు  బియ్యం పంపిణీ చేసిన గంట్ల శ్రీనుబాబు

నిరుపేదలను ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైంది


లాక్ డౌన్ పొడిగింపు తో ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు


పలు ప్రాంతాల్లో 1000 కేజీలు  బియ్యం పంపిణీ చేసిన గంట్ల శ్రీనుబాబు


(సిటీ ట్రెండ్ న్యూస్ విశాఖపట్నం)




విశాఖపట్నం  కరోనా మహమ్మారి   నేపథ్యంలో పేద ప్రజలను మరింతగా  ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి. వైజాగ్ జర్నలిస్టుల  ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు..మంగళవారం 93 వార్డ్ తో పాటు . పలు ప్రాంతాల్లో శ్రీను బాబు తన సొంత నిధులతో కొనుగోలు చేసిన వెయ్యి కేజీల బ్రాండెడ్ ( చిన్న సన్నాలు ) బియ్యం పంపిణీ చేశారు.... తొలుత ఇక్కడ సుజాతనగర్ ప్రాంతంలో 25 కుటుంబాలకు ఆయన బియ్యం అందజేశారు.,, ఆ తర్వాత వుడా లే అవుట్.. బాలయ్య శాస్ట్రీ లే అవుట్  ప్రాంతాల్లో మరికొన్ని కుటుంబాలకి బియ్యం  పంపిణీ చేశారు... మూడు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఇప్పటికే అనేక స్వచ్ఛంద సంస్థలు,. పరిశ్రమలు..యాజమాన్యంలు . దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలును  ఆదుకుంటున్నారని   కొనియాడారు.. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో,, నిరుపేద ప్రజలు సహాయం కోసం మరింతగా  ఎదురు చూస్తూ ఉంటారు అన్నారు... ఈ సమయంలో ఎవరికి తోచిన సాయం వారు మరింతగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు,.. ఈ కార్యక్రమంలో  గంట్ల  హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.