తేదీ:14-4-2020.పాడేరు లో.గిరిజన సంఘం.ఆంధ్ర రాష్ట్ర కమిటీ. అద్వర్యం లొ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్129 వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిగాయి.
లాక్ డౌన్ కాలం లో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి.
కరోన తో పాటు మలేరియా మహమ్మారి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
గిరిజన రైతు లను విస్మరించడం ప్రభుత్వానికి తగదు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకుని పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ.
గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్129 వ జయంతి ఉత్సవాలను విశాఖపట్నం జిల్లా పాడేరు లో ఘనంగా జరిగాయి. గిరిజన సంఘం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జయతి కార్యక్రమం నిర్వహించేము.
లాక్ డౌన్ మాత్రమే కరోన ను నివరించలేదని, పేద ప్రజలకు ఆహార భద్రత కల్పన నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స ప్రభుత్వాలను కోరారు.
చింత పండు, పసుపు,మిరియాలు సాగు చేసే రైతుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని, జి. సి సి ద్వారా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కోరారు.మైదానంలో రైతులను అడుకోవడాని ప్రభుత్వం చర్యలు తీసుకుందని గిరిజన రైతుల్ని విస్మరించడం సరికాదని అన్నారు.
కరోన లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పేదలకు సహాయం అందించాలని, భౌతిక దూరం పాటించాలని, లాక్ డౌన్ కాలంలో ప్రజలను ఆదుకోవడానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ప్రకటించాలని, కార్మికుల,కర్షక,దళిత,ఆదివాసుల హక్కులు రక్షణ కు, రాజ్యాంగ పరిరక్షణ డా,,బి.ఆర్ ఆశయాలు సాధన కు ప్రజలు ముందుకు రావాలని, కరోన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నా పేదలకు సహాయం చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకుని రేషన్ కార్డులు లేని పేదలకు ఉచితంగా బియ్యం, కూరగాయలు పంపిణీ చేశాం. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స, గిరిజన ఉపాద్యాయులు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలకంఠం, డా,,బి.ఆర్.అంబేద్కర్ అధ్యయన వేదిక కన్వీనర్ నాగేశ్వరరావు, గిరిజన వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి నాగరాజు, గిరిజన సంఘం మండల నాయకులు మోద శ్రీను, వివిధ శాఖలోన్న గిరిజన ఉద్యోగులా నాయకులు కె.వి.రమణ,జుంబు దేముడు,మోద అప్పారావు, కొర్ర సత్యరావు, నూకరాజు,వల్లంగి రమణ, మరియు గ్రామస్తులు, ఉపాద్యాయులు, ఉద్యోగులు పాల్గున్నారు.