లాక్‌డౌన్‌లో మీరు వెహికిల్‌తో రోడ్డుపైకి వస్తున్నారా నన్నెవరూ చూడట్లేదని లైట్ తీసుకుంటున్నారా

లాక్‌డౌన్‌లో మీరు వెహికిల్‌తో రోడ్డుపైకి వస్తున్నారా


 


నన్నెవరూ చూడట్లేదని లైట్ తీసుకుంటున్నారా


ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నా ఎవరూ విన్పించుకోవడం లేదు. బండ్లేసుకొని రోడ్డుమీదకు వచ్చేస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చినా, కేసులు నమోదు చేసినా తిరగడం మాత్రం మానేడం లేదు. దీంతో అకారణంగా రోడ్లపైకి వస్తే తాట తీస్తున్నారు పోలీసులు. బైకులను సీజ్ చేస్తున్నారు. ఆ వాహనాలను పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తున్నారు. లాక్‌డౌన్‌లో మీరు వెహికిల్‌తో రోడ్డుపైకి వస్తున్నారా...! నన్నెవరూ చూడట్లేదని లైట్ తీసుకుంటున్నారా..? ఐతే జాగ్రత్తా..! లక్షల కెమరాలు మీ వెహికిల్‌ను స్కాన్‌ చేస్తున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంటి నుంచి బయలు దేరినప్పడి నుండి... మళ్లీ ఇంటికొచ్చేవరకూ మీరు ఎక్కడెక్కడికి వెళ్లారన్నది కెమరాలు బందించేస్తున్నాయి. అంతేకాదు.. డే టు డే మీ వెహికల్‌ ట్రాక్‌ను రికార్డు చేసి మీ బండి నంబర్‌పై చిట్టాను తయారు చేస్తున్నారు పోలీసులు. లాక్‌డౌన్‌ తర్వాత కష్టాలు ఎదుర్కోక తప్పదంటున్నారు పోలీసులు . ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిదిలోనే లక్షా పదిహేను వేల కెమరాలు...ప్రతీ వెహికిల్‌ను ట్రాక్‌ చేస్తున్నాయంటున్నారు హైదరాబాద్ పోలీసులు . లాక్‌డౌన్‌ వయోలేషన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా ప్రతీ వాహనానికి భారీగా చలానాలు రాబోతున్నాయంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ లెక్కన ఇపుడు ఎవరూ చూడడం లేదు కదాని రోడ్డెక్కితే దెబ్బ మామూలుగా ఉండదు మరి.