ఏప్రిల్ 29 న  కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని ఇంటి వద్దే నిరసన వ్యక్తం చేయండి. భౌతిక దూరం తప్పని పాటించాలి. -గిరిజన సంఘం.




          ఆదివాసీల పొట్టకొట్టవద్దు.
100శాతం రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలి గిరిజన సంఘం  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ.


(సిటీ ట్రెండ్ న్యూస్ -మనపాడేరు 



 గిరిజన సలహా మండలి( టి ఏ సి)లో తీర్మానం చేసి సుప్రీంకోర్టు తీర్పు తో ఆదివాసులకు నష్టం నివారణకు    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ వెంటనే తీసుకురావాలి.


  ఏప్రిల్ 29 న  కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని ఇంటి వద్దే నిరసన వ్యక్తం చేయండి.
భౌతిక దూరం తప్పని పాటించాలి.
-గిరిజన సంఘం.



జీవో నెంబర్ 3 రద్దుతో ఆదివాసుల  జీవిత భద్రతకు పెనుప్రమాదం వచ్చిందని, ఏజెన్సీ ప్రాంతంలో100 శాతం రిజర్వేషన్  చట్టబద్ధత కల్పించాలని   కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు  గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స   డిమాండ్ చేశారు.
        
       స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో సుప్రీంకోర్టు తీర్పు తో ''గిరిజనుల పొట్ట కొట్టవద్దని'' ఖాళీ కంచాలతో ప్రభుత్వానికి  నిరసన వ్యక్తం చేశారు. 
అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ  రాష్ట్ర  ఆదివాసీ ప్రాంతాలలో  నిరుద్యోగులకు ఉపాధి,ఉద్యోగం లో స్థానిక గిరిజనుల కు 100% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 3 ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆదివాసీ నిరుద్యోగులకు  తీవ్రమైన నష్టం వాటిల్లిందని అన్నారు. 
      5వ షెడ్యూల్డ్ చట్టం క్లాజ్ 5 సబ్ సెక్షన్ 1 ప్రకారం  రాజ్యాంగం ద్వారా రాష్ట్ర గవర్నర్ గారికి సంక్రమించిన విశేష అధికారం ద్వారా జీవో నెంబర్3 అమల్లోకి వచ్చిందాని, 100 శాతం గిరిజన రిజర్వేషన్ కు చట్టబద్ధత లేదని సుప్రీంకోర్టు పేర్కొందని, గిరిజన సలహా మండలి (టీఎసి)లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు రావాలని గిరిజన ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తో గిరిజనులకు నష్ట నివారణ కోసం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరారు. 
    
      ఈ తీర్పు అమలైతే విద్య శాకే కాకుండా 19 శాఖలలో  సుమారు 35 రకరకాల ఉద్యోగలు కు స్థానిక గిరిజనులు కోల్పోతారాని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగుల పెరుగుతారాని గిరిజన ప్రాంతంలో ఆసాంగీక కార్యక్రమాలు పెరిగే అవకాశం ఉందాని, 5వ షెడ్యూల్డ్ ఏరియా రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు లో గిరిజన లకు అనుకూల వాదన వినిపించడం లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.


     విద్య,వైద్య,రాజకీయ, మరియు భూమి పై ఆదివాసుల కు రాజ్యాంగం ద్వారా హక్కులు ప్రత్యేకించబడ్డాయి. షెడ్యూల్డ్ ఏరియా లో ఆదివాసీల రిజర్వేషన్ లో రాజకీయ రిజర్వేషన్ వల్ల సామాజిక వివక్షత కు గురి కబుడుతున్న ఆదివాసులకు చట్ట సభల్లో కూడ ప్రాతినిధ్యం కోల్పోతారని ఆరోపించారు.
               కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత  రిజర్వేషన్ ప్రాధమిక హక్కు కాదని,అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం పై ఆధారపడి ఉంటుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను  సుప్రీంకోర్టు సమర్ధిస్టు తీర్పు వెలువరించింది.ఇది రాజ్యాంగ లక్ష్యం ను దిక్కరించాడమే అవుతుందని అన్నారు. 
           
     గిరిజన ఉద్యోగుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు కుడుముల కాంతారావు మాట్లాడుతూ  ఆదివాసీ రిజర్వేషన్ రక్షణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు లో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు.
కరోన లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి వద్ద నుండే ఏప్రిల్29న నల్ల రిబ్బన్ ను కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శనలు చేయాలని ప్రజలకు,గిరిజన సంఘం కార్యకర్తలుకు పిలుపు నిచ్చారు.  ఈ కార్యక్రమంలో గిరిజన ఉపాద్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నిలకంఠం, గిరిజన వైద్య,ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శెట్టి నాగరాజు, యూటీఫ్ డివిజన్ కన్వీనర్ చీకటి నాగేశ్వరరావు, పి.ఆర్.టి.యు నాయకులు కొర్ర మోహన్ రావు, గిరిజన సంఘం నాయకులు కొమ్ము బాస్కర్ రావు,మోద శ్రీను,వల్లంగి వెంకటరమణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.