ఈరోజు తూర్పు గోదావరి జిల్లా ,రంపచోడవరం నియోజకవర్గం, రాజవొమ్మంగి మండలంలోని పలు గ్రామాల్లో అరకు పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి* పర్యటించారు.
(సిటీట్రెండ్న్యూస్ తూర్పుగోదావరి)
అరకు పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఈరోజు తూర్పు గోదావరి జిల్లా ,రంపచోడవరం నియోజకవర్గం, రాజవొమ్మంగి మండలంలోని పలు గ్రామాల్లో *గౌ" అరకు పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి* గారు పర్యటించారు.
ఈ సందర్భంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్న అప్పటికీ మన గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక పాజిటివ్ కేసులు నమోదు పోవడం మనందరం అదృష్టవంతులుగా భావించదగ్గ ఒక విషయం అని ఎంపీ గారు తెలిపారు.
కిర్రబ్, కిండ్రా, లాగారాయి గ్రామపంచాయతీలో పర్యటించిన *అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి* , శివ ప్రసాద్* శాసనసభ్యులు *శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి* మరియు డీసీసీబీ చైర్మెన్ *అనంత బాబు* కలిసి గ్రామస్తులకు కూరగాయలు, మాస్క్ మరియు శానిటిజర్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడి చేసే చర్యల్లో భాగంగా నిరంతరం శ్రమిస్తున్న వైద్య మరియు ఆరోగ్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు & అధికారులు పాల్గొన్నారు.
*StayHomeStaySafe*