గిరిజన సంఘం ఆధ్వర్యంలో
జీవో నెంబర్ 3
(సిటీ ట్రెండ్ న్యూస్ - మన పాడేరు)
రద్దు ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని పెదబయలు లో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేశారు.
జీవో నెంబర్ 3 రద్దు చేస్తూ ప్రకటన వెలువడిన ఏప్రిల్ 22వ తేదీ నుండి అనేక రూపాలలో గిరిజన సంఘం ఆధ్వర్యాన అనేక నిరసన కార్యక్రమాలు చేస్తు ఉన్నప్పటికీ ఇంతవరకు ఆదివాసి ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీ నుండి సరైనటువంటి స్పందన రాకపోవడాన్ని ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆదివాసి యువతరం ఉద్యోగ అవకాశాలు లేక డిగ్రీలు పీజీలు చేసి విలువైన జీవితాన్ని కోల్పోయి ఉన్నారని ఇటువంటి సందర్భాలలో ఆదివాసి ఉద్యోగాలకు వజ్రాయుధంల ఉన్న జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు
చేయడం అంటే
ఆదివాసుల పొట్ట కొట్టడం తప్ప మరొకటి కాదని అదేవిధంగా ఇప్పటివరకు ఆదివాసీల కోసం ఆదివాసుల అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడతా మనీ ఉదర కొడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన స్పందించకపోవడం పట్ల
గిరిజన సంఘం విశాఖపట్నం జిల్లా తీవ్రంగా తప్పు పడుతుంది.
ఆదివాసి ప్రాంతంలో అన్ని శాఖలలో ఉద్యోగ నియామకాలు వందకు వందశాతం స్థానిక గిరిజనులకే ఉండాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పడుతు ఆదివాసుల జీవన పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమని
గిరిజన సంఘం విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు అన్నారు.
ఆదివాసుల మనుగడకు అభివృద్ధికి ముప్పు వాటిల్లే చర్యలు మానుకోవాలని ఇటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయశాఖ లు ఆలోచించాలని ఈతవు పలికారు. ఇప్పటికైనా జీవో నెంబర్ 3 యధాతధంగా కొనసాగించేలా ఆదివాసుల తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా పనిచేయాలని లేనిపక్షంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు అన్నారు.