తేదీ:22-4-2020,
(సిటీ ట్రెండ్ న్యూస్ )
👉జి.ఓ నెంబర్ 3 రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఇంటి వద్ద నుండే ప్లేకార్డు తో నిరసన ప్రదర్శనలు చెయ్యాలి.
✊-గిరిజన సంఘం.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలలోని ఆదివాసీ ప్రాంతాల నిరుద్యోగులకు ఉపాధి,ఉద్యోగం లో స్థానిక గిరిజనుల కు 100% రిజర్వేషన్ కల్పిస్తూ ఆనాటి గిరిజన సంక్షేమ శాఖ కమీషనర శ్రీ EAS శర్మ, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ SR శంకరన్ ల నేత్రుత్వoలో ఉమ్మడి గవర్నర్ గారి ఆదేశాలతో జీవో నెంబర్3 అమల్లో వచ్చింది. ఇచ్చిన ఆదివాసీ రిజర్వేషన్ సుప్రీం కోర్టు కొట్టి వేయడం ను గిరిజన సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది.
జి.ఓ నెంబర్3 అమలు ద్వారా విద్యా శాఖ లో ఉపాధ్యాయ పోస్టులు నూటికి నూరు శాతo ఆదివాసీలకే కేటాయింపు అయ్యాయి. అప్పటి నుండి ఈ GO రద్దు కోసo గిరిజనేతర వర్గాలు చేయని ప్రయత్నo లేదు. ముందు వారు ఈ GO ను హై కోర్టు లో సవాల్ చేసారు. కాని హై కోర్టు ఈ ఉత్తర్వులు రాజ్యంగా విరుద్దం కాదని ఆ కేసును కొట్టివేసింది. తరువాత సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ కేసును సుప్ర్రీం కోర్టు రాజ్యoగ ధర్మాసనానికి నివేదించింది.
అంతర్జాతీయ న్యాయమూర్తుల సభలో మోడీ ని ఆకాశానికి ఎత్తుతూ ప్రస్తుతించిన జస్టిన్ అరుణ మిశ్రా అధ్యక్షతన గల సుప్రీం కోర్టు 5 మందితో కూడిన డివిజన్ బెంచ్ ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీ యువతి, యువకులకు నూటికి నూరు శాతo ఉపాద్యాయ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని కొట్టి వేస్తూ, కేసు వేసిన పిటీషనర్లకు రెండు తెలుగు రాష్ట్రాలు కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేసించింది.
నిజానికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల ఆదివాసీ ప్రాంతాలలో అమలౌతున్న ఈ విధానన్ని బలపర్చడంతో బాటు, ఇతర అన్ని రాష్ట్రాల ఆదివాసీ ప్రాంతాలలో అమలు చేయమని సుప్రీం కోర్టు ఆదేశించడం దారుణం.
రాజ్యంగం ఐదవ (5) షెడ్యుల్, 5వ పేర లో ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక హోదా ను కలిగివుంది. గవర్నర్ గారికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే చాటాలను సైతం సంక్షించి,ఆదివాసీ ప్రాంతాల్లో చేర్పులు మార్పులు చేసి అమలు చేసే అధికారం గవర్నర్ గారికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు లో సరైన వాదన వినిపించలేక పోయింది. అందుకే అదివాసులకు వ్యతిరేకంగా, జీవో నెంబర్3 రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ ప్రాధమిక హక్కు కాదని,అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం పై ఆధారపడి ఉంటుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్ధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గిరిజన వ్యతిరేక విధానాలతో ఆదివాసీలకు రాజ్యాంగ కల్పించిన హక్కులు,చట్టాలను రద్దు చేస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వేoటనే స్పoదించాలి, సుప్రీo కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చెయ్యాని రాష్ట్ర ప్రభుత్వాలు లాపై ఒత్తిడి పెంచడానికి ఇంటి వద్ద నుండే నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని గిరిజన ఉద్యోగ,ఉపాధ్యాయుల, విద్యార్థులు,యువతి యువకులకు గిరిజన సంఘం విజ్ఞప్తి చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ను సవాల్ చేస్తూ గిరిజన సంఘం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిటిషన్ దాఖలు చేస్తోంది.
అభినందనలతో...పి.అప్పలనర్సప్రధాన కార్యదర్శి.గిరిజనసంఘం.