CITU, అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో ఈరోజు పాడేరు ఏరియా ఆసుపత్రిలో పారిశ్యుద్ధ కార్మికులకు, అంబులెన్స్ డ్రైవర్స్ మొత్తం 35 మందికి సరుకులు పంపిణీ
నిత్యావసర సరుకులు పంపిణీ
జిల్లా ఆసుపత్రి,పారిశుద్ధ్య కార్మికులు, అంబులెన్స్ సిబ్బందికి పాడేరు సీఐటీయూ,అంగన్వాడీ కార్యకర్తలు సహాయంతో ఆసుపత్రి వైద్యులు ద్వారా కురకాయలు, బియ్యం, కిరాణా సామానులు 35 కుటుంబాలకు అందించారు,
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు మాట్లాడుతూ కరోన లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,చాలీచాలని జీతాలు సక్రమంగా రాక క్రింది స్థాయి కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు,వైద్య సిబ్బంది పారిశుధ్య కార్మికులు,రక్షక భటులు కరోన వ్యాప్తి అరికట్టేందుకు రాత్రి,పగలు కృషి చేస్తున్నారని, పారిశుధ్య కార్మికులు సన్మానాలు కోరుకోవడం లేదని బకాయి జీతాలు,మాస్కులు, గ్లోవ్స్,రక్షణ పరికరాలు అడుగుతున్నారని ప్రభుత్వం జీతాలు చెల్లించకుండా చప్పట్లు కొట్టారు అని అన్నారు.
ఏ పి అంగన్వాడీ వర్కర్స్&హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు వి.బాగ్యాలక్మి, మాట్లాడుతూ సాటి కార్మికులు కి అండగా నిలబడాలని అంగన్వాడీ యూనియన్ జిల్లాలో అనేక చోట్ల వలస కార్మికులు కి,పేదవారికి అండగా కార్యక్రమలు నిర్వహిస్తున్నామని అన్నారు,దేవి,వసంత,వెంకటలక్ష్మి, అంబికా,వనిత,భారతి,
సీఐటీయూ నాయకులు సుందరరావు, నాగరాజు,గిరిజన సంఘం నాయకులు మోదా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది..
SUBSCRIBE MANAPADERU CHANNELON YOUTUBE