పంచాయతీ పారిశుధ్య కార్మికులు కి బకాయి జీతాలు చెల్లించాలి.
కరోన లాక్ డౌన్ లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. రాష్ట్ర వ్యాపితంగా పంచాయతీ కార్మికులు 5 నెలల నుండి 11 నెలల వరకు ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. జీతాలు లేక ఆకలి కేకలు తో కార్మికులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల కు సన్మానాలు చేయడం, అభినదిచడం వలన ఉపయోగం ఉండదని.తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేస్తున్నది. పాడేరు పంచాయతి కార్మికులు కి గత 5 నెలలుగా జీతాలు చెల్లించలేదు. మాస్కులు,గ్లోవ్స్, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని.కావున రక్షణ పరికరాలు, జీతాలు చెలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
ఆర్. శంకరరావు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు