జనకులం ఫౌండేషన్ చేఆరువేల మాస్కుల చేయూత

జనకులం ఫౌండేషన్ చేఆరువేల మాస్కుల చేయూత


(తాటిచెట్లపాలెం: సిటీ ట్రెండ్ న్యూస్)reporter:B.SANTOSH 


2004 వ సంవత్సరంలో నెలకొల్లబడిన 
సామాజిక సేవా సంస్ధ 
జనకులం ఫౌండేషన్    
కరోనా బాధితులను సేవల నందిస్చున్న ప్రభుత్వ సంస్ధలకు  చేయూత నిస్తుంది.


అందులో భాగంగా  (Rs 50,000/- ) యాభై వేల రూపాయల విలువ చేసే అయిదు వేల 
డిస్పోజల్  మాస్కులను
విశాఖ నగర పోలీస్ కమీషనర్ 
ఆర్. కె. మీనాకు  జనకులం మేనేజింగ్ ట్రస్టీ  చింతలపాటి సత్యదేవ్ సమర్పించారు. 



విశాఖ సిటీ లోనున్న 
పోలీసులందరిక్ ఈ మాస్కులను 
ఇవ్వాలని ఆయన కమీషనరును కోరారు.


అలాగే    ఇండియన్ మెడికల్ అసోషియేన్ ప్రెసిడెంట్ డాక్టర్  రమణికి  సంస్ధ తరఫున   (Rs 70,000/-)
డబ్భైవేల  రూపాయల విలువ చేసే 
250 యన్ 95  మార్క్స్ ను ఆయన ఇచ్చారు.


జూనియర్ డాక్టర్స్ అసోషియేషన్  వైద్య బృందానికి   వెయ్యి మాస్కులను 
కూడా సత్యదేవ్ అందజేశారు.
నలభై వేల రూపాయుల విలువ చేసే 
బియ్యాన్ని,  పప్పు దినుసులను కొన్ని
సామాన్య కుటుంబాలకు జనకులం అందించింది..