ఇతను గిరిజన నిరుపేద కుటుంబంలో జన్మించి ఉన్నారు. 5000  మాస్క్ లను కొయ్యూరు,  జికె వీధి మండల ప్రజలకు  పంపిణీ చేశారు .

విశాఖ ఏజెన్సీ :-ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వలన తన వంతు గిరిజన ప్రాంత పేద ప్రజలకు సాయం చేయాలన్న సేవా దృక్పథంతో   దుమంతి.సత్యనారాయణ  5000 
మాస్క్ లను కొయ్యూరు,  జికె వీధి మండల ప్రజలకు 
పంపిణీ చేశారు .



ఇతను గిరిజన నిరుపేద కుటుంబంలో జన్మించి ఉన్నారు.


 చిన్నతనం నుండి సేవ భావం అంటే చాలా మక్కువ .


ఈయన జీకే వీధి మండలం లోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తూ ఉన్నారు.


తనకొచ్చిన జీతంతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ కొంత డబ్బులను సేవా కార్యక్రమాలకు ఉపయోగ ఇస్తూ ఉంటారు .


2013 సంవత్సరం నుండి ఈయన సేవా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది .


కొయ్యూరు చింతపల్లి జీకేవీధి మండలాల్లో తన సొంత నిధులతో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది .


పదివేల 264 మొక్కలను నాటించడం జరిగింది .


పాత బట్టలు వసూలుచేసి గిరిజన ప్రాంత నిరుపేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది .


గ్రామాల్లో అవయవ దానం పై అవగాహన కల్పిస్తూ ఇప్పటికీ 600 మంది చేత అంగీకార పత్రాలను తీసుకొనడం అయినది .


పేద విద్యార్థులకు పుస్తకాలు పోటీ పరీక్షల మెటీరియల్ పంపిణీ చేయడమైనది.


 మరియు కొయ్యూరు జీకేవీధి చింతపల్లి మండలాలలో మారుమూల ప్రాంత గిరిజన ప్రజలకు  కరోన వైరస్ పై అవగాహన కలిపిస్తూ ప్రజలకు  చైతన్య పరుస్తున్నారు.