విశాఖపట్నం జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ ఐపీఎస్ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో ప్రజలు, వాహనాల, దుకాణాలు నియంత్రించడానికి పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రజా రవాణాను నిషేధించిన ఉత్తర్వులు అమలులో ఉండగా, రోడ్లపై తిరుగుతున్న ఆటోలు, మొదలైన వాటిపై చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరిగిందిని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈరోజు విశాఖపట్నం జిల్లా పరిధిలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై 55 కేసులు మరియు 556 కేసులు ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపై మొత్తం సాయంత్రం 6 గంటల వరకు 611 కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు 14 వాహనాలను స్వాధీనం చేసుకుని అపరాధ రుసుముగా రూ.3,14,910/- వసూలు చేయడం జరిగిందని తెలిపారు.
ఈరోజు విశాఖపట్నం జిల్లా పరిధిలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై 55 కేసులు మరియు 556 కేసులు ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపై