దాతలు సహకారంతోనే నిరుపేదలకు సహాయం
పోస్ట్ఆఫీస్......
పాత నగరంలో ఉన్న శ్రీ వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ .. అనాధ ఆశ్రమానికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి .. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు
(సిటీట్రెండ్ న్యూస్ విశాఖపట్నం)
తన వంతు విరాళంగా 75, 000 రూపాయలు అందజేశారు... ఇందుకు సంబంధించిన మొత్తాన్ని శుక్రవారం ఆయన చెక్ రూపం లో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జహీర్ అహ్మద్ కి అందజేయడం జరిగింది తొలుత వృద్ధులు కు.. అనాధల కు శ్రీనుబాబు దుప్పట్లు అందచేశారు. అనంతరం అన్నదానము ప్రారంబించారు.. ,,,ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇక్కడ నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి తన వంతుగా 50.000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు...చాలా ఏళ్లుగా ఈ మొత్తం అందచేస్తూ వస్తున్నానన్నారు.. . కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది ఆ మొత్తాన్ని 75, 000 కు పెంచి ఇవ్వడం జరిగింది అన్నారు.. . సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ దాతలు సహకారంతోనే వివేకానంద సేవా సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు,,. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతో మంది అన్నార్తులకు.. నిరుపేదలకు,.. వివేకానంద సంస్థ తమ సభ్యులు ద్వారా సేవలందిస్తూ వస్తుంది అని వివరించారు.. ప్రతీ రోజు అల్పాహారం.. భోజన సదుపాయం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు తమ సంస్థ నిర్వహించ కలుగుతుందన్నారు.... కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ జహీర్ సూచించారు,.. సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంట్ల హర్షవర్ధన్... సంస్థ సభ్యులు పాల్గొన్నారు.