సామాజిక సేవలే లక్ష్యము
జర్నలిస్టులకు అరటి పండ్లు పంపిణీ
విశాఖపట్నం
(సిటీ ట్రెండ్ న్యూస్ విశాఖపట్నం)21-4-20
కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాజిక సేవలే లక్ష్యంగా పని చేస్తున్నామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు... మంగళవారం
బాలయ్య శాస్త్రి లేఅవుట్లో తమ కార్యాలయం వద్ద అరటి పండ్లు గెలలు పంపిణీ చేశారు...ఈ సందర్బంగా శ్రీనుబాబు మాట్లాడుతూ కరోనా సమయం లో జర్నలిస్ట్ ల ను ఆదుకోవాలి అని తాను భావించడం జరిగింది అన్నారు.. అందువల్లే తన సొంత నిధులు తో దశల వారీగా సుమారు 550 మంది జర్నలిస్ట్ ల కు నిత్యావసర వస్తువులు అందచేసామన్నారు.. ప్రస్తుతం అందరికి అరటి పండ్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు..