రేషన్ కార్డు లేని వారికి బియ్యం,కూరగాయలు పంపిణీగిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స పంపిణి చేశారు.

 


              
                 తేదీ:6-4-2020, పాడేరు.
=========================


👉రేషన్ కార్డు లేని వారికి బియ్యం,కూరగాయలు పంపిణీ
  👉 పరిశుభ్రత తో కరోన దూరం.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
రేషన్ కార్డు లేని వారికి ప్రభుత్వం బియ్యం పంపిణీ చేయకపోవడం తో లాక్ డౌన్ కాలం లో రేషన్ కార్డు లేని కూలీలకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో 5 కేజీ ల బియ్యం, కూరగాయలు క్యాబేజీ, అనపకాయ ను  గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స పంపిణి చేశారు.
 పాడేరు మండలం చింతలవీధి గ్రామపంచాయతీ పరిధిలో రేషన్ కార్డు లేని గిరిజన మహిళలకు ఉచితంగా ఐదు కేజీల బియ్యం కూరగాయలు పంపిణీ అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ కరోన మహమ్మారి ప్రపంచం ను కబలిస్తోందని, కరోన నివారణకు పరిశుభ్రత మరియు భౌతిక దూరం పాటించడం ద్వారా సాధ్యమని అన్నారు.  గిరిజన ప్రాంతాల్లో సీజన్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని మలేరియా, టైపాడ్, జ్వర పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య పనులు ఇంటి చుట్టు, గ్రామంలో చేపట్టాలని కోరారు. దోమలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం పై అవగాహన కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించి నగదు మొత్తం 3500 చొప్పున్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, రేషన్ కార్డులు లేని వారికి మానవత్వం తో ప్రభుత్వం బియ్యం, నగదు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం ప్రకటించిన బియ్యం తో పాటు 14 రకాల నిత్యావసర సరుకులు ఇచ్చి ప్రజలను కాపాడాలని అన్నారు. చింతపండు, మిరియాలు, పసుపు ను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో గిరిజన రైతులు తీవ్ర నష్టం తో ఉన్నారని, గిరిజన రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.                


చింతాలవిది పంచాయితీ పరిధిలో ఎక్కువ మంది భవన నిర్మాణకార్మికులు ఉన్నారని లాక్ డౌన్ వల్ల ఉపాధి లేదని వీరికి భవన నిర్మాణ సంక్షేమ నిధి నుండి 10 వేలు రూపాయిల చొప్పున భృతి ఇచ్చి ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు  సుందర్రావు నాగరాజు గిరిజన సంఘం నాయకులు మోద శ్రీను, వలంగి రాజులమ్మ బొజ్జన్న, ప్రసాద్  మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.