2020 వచ్చిన గిరిజనుల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు గిరిజన ప్రాంతంలో.
(సిటీ ట్రెండ్ న్యూస్ )
ఇలాంటి సమస్యలను చూస్తే ఎంతో బాధకలుగుతుంది.
నా ఆలోచన ఎప్పుడూ సామాజికంగా వెనుకబడిన వాళ్ళ కోసమే పరితపిస్తూ.. ఉంటుంది.
కానీ అసలు అధికార యంత్రాంగం ఏం చేస్తుంది. ప్రజలు ఓట్లు వేయించుకుని గెలిచిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా తమ గోడుని తెలియజేయడమే కానీ ఫలితం మాత్రం శూన్యం.
స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్ళు గడిచినా... కూడా గిరిజనులకు తాగడానికి మంచి నీళ్ళు అందుబాటులో లేకపోవడంతో చాలా బాధాకరం మరియు విచారకరం. సంబంధిత కొయ్యూరు మండలం అధికారులు స్పందించి, ఆదివాసుల గోడుని పరిష్కారం చేయగలరనీ కోరుతున్నారు.