D.L.B గ్రౌండ్లో శానిటైసర్ స్ప్రే ఛాంబర్ ను ప్రారంభించిన కె.కె.రాజు
(సిటీ ట్రెండ్ న్యూస్ విశాఖపట్నం)reporter: B.SANTOSH KUMAR
కోవిడ్-19 వైరస్ నిర్ములనలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కైలాసపురం D.L.B గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు బజారు వద్ద గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన శానిటైసర్ స్ప్రే ఛాంబర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ,46వార్డు వై.యస్.ఆర్.సి.పి అభ్యర్థి కట్టుమురి సతీష్, కె.అనీల్ కుమార్ రాజు గారు, 45 వార్డు ప్రెసిడెంట్.పైడి రమణ, హరి పట్నాయక్, గోవింద్, కోవగపు లావణ్య ,పాల్గొన్నారు.