లోకులగాంధీ పిలుపుతో హోంగార్డులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మురళి కృష్ణ
కృష్ణదేవిపేట, ఏప్రిల్ 6: ( సిటీట్రెండ్ న్యూస్)
మన పాడేరు
కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు,బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకులగాంధీ పిలుపుతో హోంగార్డులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు కొండ గోకిరి గ్రామాన్ని దత్తత తీసుకున్న మురళీకృష్ణ తెలిపారు. సోమవారం కృష్ణదేవిపేట, కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ సామాజిక బాధ్యత లో భాగంగా లాక్ డౌన్ కాలంలో నిరుపేదలను తనవంతుగా ఆదుకోవాలని లక్ష్యంతో ఇటీవల కొండ గోకిరి గ్రామంలో వంద మంది నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం అన్నారు. తాజాగా హోంగార్డులకు బియ్యం, ఉల్లిపాయలు, మిరపకాయలు, కారం, వంకాయలు, టమోటాలు,ఉప్పు, బంగాళదుంపలు సరుకులను కొయ్యురు సీఐ వెంకట రమణ, కెడిపేట ఎస్ఐ భిమారాజు గారి సమక్షంలో పంపిణీ చేస్తామన్నారు.