ఒక్క రోజు నిరాహార దీక్ష చెసిన మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్


ప్రభుత్వం పూర్తిస్థాయిలో క రోన విపత్కర పరిస్థితులలో ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు.


ప్రజలకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తన క్యాంపు కార్యాలయంలో నిరాహారదీక్ష చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తూతూ మంత్రంగానే ప్రభుత్వం బియ్యం , పప్పు పంపిణీ చేస్తుందని కనీసం ప్రతి కుటుంబానికి 5 కేజీల కందిపప్పు వంట నూనె వంటగ్యాస్ ఇవ్వలేదని,కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయలు కూడా ఇంకా చాలామందికి అందలేదని గిరిజన ప్రతి కుటుంబానికి కనీసం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అలాగే ప్రతి కుటుంబానికి మాస్కులు , శానిటైజర్స్ ఉచితంగా అందించాలని మరియు విభాగం ఆధ్వర్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆయుర్వేద హోమియో మందులు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ దీక్షకు మద్దతుగా పార్టీ నాయకులు వెంకటరమణ. పద్మ ,పాండురంగ స్వామి మహేశ్వరి,సత్తిబాబు శశిభూషణ్ ,వెంకట్రావు పాల్గొన్నారు.