విశాఖ ఏజెన్సీలో... కరోనాలో కొండపై కొత్త ఆలోచన
ఒక మంచి ఆలోచనతో తో అందరికి ఆదర్శంగా నిలుస్తున్న గిరిజన యువకుడు....
బ్యాంక్ సంబంధిత యాప్ ద్వారా ఓ కొండ పై సిగ్నల్ వచ్చే చోట గిరిజనులకు డబ్బులు పంపిణీ చేస్తున్న యువకుడిని చూసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు..
పాడేరు మండలం వంతాడపల్లి పంచాయితీ అల్లివరం, కోడిగుడ్లు,వణుగురాయి,సప్పిపుట్టు వంటి గిరిజన గ్రామాలు లాక్ డౌన్ కారణంగా నెల రోజుల నుండి గ్రామాల్లో నిర్బంధం అయ్యారు అయితే వారికి పాడేరు పది కిలోమీటర్ల దూరం అయినా వెళ్లే సౌకర్యం లేదు ఒక్కొక్కరుగా నడచి వెళ్లినా బ్యాంక్ ల వద్ద సమయ చాలక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇదంతా గమనించిన జాన్ రాజ్ అనే గిరిజన యువకుడు గ్రామ సమీపంలో ఓ కొండ పై సిగ్నల్ రావడంతో అక్కడ తన మొబైల్ లో ఓ యాప్ సహాయంతో ఆధార్ అనుసంధానం ద్వారా వారి ఎకౌంట్ లలో ఉన్న నగదు తన ఎకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకొని తన దగ్గర నగదు ని వారికి అందించి కొంత కష్టాన్ని తిరుస్తున్నాడు.. మరుసటి రోజు ఏటీఎం ద్వారా నగదు డ్రా చేసుకొని మరి కొందరికి నగదు అందిస్తూ బ్యాంక్ లకు రాలేని గిరిజనులకు ఎంతో ఉపయోగ పడుతున్నాడు..కరోనా కష్ట కాలంలో తన వంతు గిరిజనులకు సహాయం చేస్తున్నానని తెలిపాడు..అయితే ఇక్కడ కొండ పైకి సామాజిక దూరం పాటించి నగదు తీసుకుంటున్న స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.