సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టే వారికి శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది

సోషల్ మీడియా పోస్టులతో జాగ్రత్తగా ఉండాలంటోంది ఏపీ ప్రభుత్వం.


కరోనా వంటి కష్టకాలంలో సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టే వారికి శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది. సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం తప్పుడు వార్తల్ని వైరల్‌ చేయడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది. దీంతో జగన్ సర్కార్ అలర్ట్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో   సీఐడి  రంగంలోకి దిగింది.. వాట్సాప్, సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఉంటాయంటున్నారు అధికారులు.








ఎవరైనా ప్రభుత్వం, ప్రభుత్వ బాధ్యతల్ని చూసేవారిని కించపరిచేలా, వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే ఐపీసీ సెక్షన్-124ఏ కింద నాన్‌ బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. మూడేళ్లు నుంచి జీవిత ఖైదు, జరిమానా విధించే అవకాశం ఉంది. ఆధారాలు లేకుండా అబద్దాలను పోస్ట్ చేస్తే చర్యలు తీసుకుంటారు. వ్యక్తులు, పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, కించపర్చేలా పోస్టులు, ఫోటోలు పెడితే ఐపీసీ సెక్షన్ 505 కింద నాన్‌ బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. ఈ నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.







కరోనా వైరస్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం, పోస్టింగ్‌లు ప్రచారం చేస్తే.. ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారుల ఆంక్షలను ఉల్లంఘించే చర్యలపై అంటువ్యాధుల చట్టం–54 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఏడాది వరకు జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో సోషల్‌ మీడియాపై సీఐడీ ప్రత్యేక బృందంతో నిరంతర నిఘా పెట్టింది. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి సంబంధిత