విశాఖలో మహిళకు కరోనా పాజిటివ్
విశాఖపట్నంలో గత పది రోజుల నుండి ఒక్క కరోనా పాజిటివ్ కేసు రాలేదన్న ఆనందంలో ఉండగానే ఒక మహిళకు పాజిటివ్ వచ్చిందన్న వార్తతో విశాఖ నగరం ఉలిక్కి పడింది. ఎక్కడికి అక్కడ రెడ్ జొన్లోని ఇళ్లల్లో నుండి ప్రజలను బయటకు రానివ్వకుండా అధికారులు,పోలీసులు నిరంతరం శ్రమిస్తునే ఉన్నారు. సోమవారం నుండి కొన్ని సడలింపులు వస్తున్నాయి అన్న అనందంలో ప్రజలు ఉన్నారు.అయితే షిలానగర్ లో ఒక మహిళకు కరోనా పాజిటివ్ రావడం అందర్ని కలవరపెడుటుంది.కరోనా వచ్చిన మహిళను చికిత్స కోసం గీతం హాస్పిటల్ కి తరలించారు.