లారీ డీ కొని మహిళా మృతి .....
ఎన్ .ఏడీ కూడలి ఎన్ .ఎస్ .టి ఎల్ ఎదురుగా ఒడిశా నుండి బిర్లా కూడలి మేదుగా ఎన్ .ఏడీ వైపుగా తౌడు లోడుతో వెళ్తున్న తారస్ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా డీ కొనడంతో ద్విచక్ర వాహనంపై భర్త తో వెళ్తున్న బోర్ల అప్పల నరశమ్మ 23 పై లారీ దుసుకుపోయింది . దింతో ఆమే తల నుజ్జవడంతో ఆమే ఘటన స్థలంలో మృతి చెందింది .
ప్రమాదానికి సంబందించి కంచరపాలెం ట్రాఫిక్ పోలీసు లు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి .
కె .కోటపాడు రెడ్డిపాలెం వద్ద నివాసముంటున్న బోర్ల బుజ్జి అతడి బార్య బోర్ల అప్పల నరశమ్మ కు పది నెలల క్రితం వివాహమైంది . కగా అప్పల నరశమ్మ మూడు నెల గర్భవతి కావటంతో వైద్య పరీక్షల నిమిత్తం బుదవారం ఐటిఐ కూడలి ప్రయివేటు ఆస్పత్రికి వెళ్ళి తిరిగి 12 గంటల సమయంలో బిర్లాకుడలి జాతీయ రహదారిపై నుండి ఎన్ .ఏడీ కూడలి వైపుగా వెళ్తున్న సమయంలో
ఎన్ .ఎస్ .టి ఎల్ ఎదురుగా వెనుక నుండి వస్తున్న తారస్ లారీ బలంగా ఢీకొనడంతో అప్పల నరశమ్మ కుడి వైపు రహదారి పై పడిపోవడంతో లారీ వెనుక చక్రాలు ఆమే తలపైకి దూసుకు పొయింది .
దింతో భర్త బుజ్జి కి స్వల్ప గాయలు కాగ బార్య అప్పల నరశమ్మ ఘటన స్థలం వద్దే మృతి చెందింది .
విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఏసిపి ఎం .అర్ .కే రాజు , సి .ఐ కృష్ణ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమిక్షించారు . శవ పరిక్ష నిమిత్తం మృత దేహన్ని కెజిహెచ్ మార్చురీకి తరలించారు . ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసు లు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని లారీ ని స్టేషన్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు ...