పసుపు విక్రయాలకు పక్కా ఏర్పాట్లు
ఐటీడీఏ పి.ఓ డి.కె.బాలాజీ
పాడేరు ఏప్రిల్ 15 : మండలంలోని గుత్తులపుట్టు వారపుసంతలో గిరిజన రైతులు పసుపు అమ్మకాలకు అవసరమైన ఏర్పాట్లుపక్కాగా చేయాలని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డి.కె.బాలాజీ ఆదేశించారు.
బుధవారం సంతబయలు లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు.
కొనుగోలుదారులకు, అమ్మకపుదారులకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించాలని సూచించారు.
సంత ప్రదేశాన్ని శుభ్రం పంచాయతీ సిబ్బందికి సూచించారు .
రైతులకు మాస్కలు సరఫరా చేస్తామని చెప్పారు.
అనంతరం వంతడపల్లి గ్రామంలో జరుగుతున్న దోమలమందు పిచికారీ పనులు పరిశీలించారు.
ఆ తరువాత గరకబంధ చెక్పోస్టు ను తనిఖీ చేశారు.
వాహనాలను,అంబులెన్సు లను క్షుణ్ణంగా తనికీలు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పాడేరు తహసిల్దార్ ప్రకాశరావు, ఆర్ ఐ రమణ తదితరులు పాల్గొన్నారు.