నేడు  రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం.   భౌతిక దూరం పాటిస్తూ  నిరసన వ్యక్తం.-గిరిజన సంఘం.

  సుప్రీంకోర్టులోరివ్యూ పిటీషన్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి.
నేడు  రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం.  
భౌతిక దూరం పాటిస్తూ  నిరసన వ్యక్తం.-గిరిజన సంఘం.
==============================


(సిటీ ట్రెండ్ న్యూస్ -మన పాడేరు) 



జీవో నెంబర్ 3 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు లో రివ్యూ పిటిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు.  
        
     సుప్రీంకోర్టు తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో కళ్ళకు గంతలు కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు లో భాగంగా పాడేరు గిరిజన సంఘం కార్యక్రమంలో    నిరసన వ్యక్తం చేశారు. 
అనంతరం మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ  రాష్ట్ర  ఆదివాసీ ప్రాంతాలలో గిరిజనుల కు తీవ్రమైన నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.  ప్రతివాదులుగా ఆంధ్ర,తెలంగాణ ప్రభుత్వాలు గిరిజనుల కు 100 శాతం రిజర్వేషన్లు కోసం సుప్రీం కోర్ట్ తీర్పు పై రివ్యూ పిటిషన్ వేయాలని గిరిజనులు, మేధావులు, ఉపాద్యాయులు, ఉద్యోగులు కోరుతున్న నేటికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదాని అన్నారు.
       గిరిజన సలహా మండలి (టీఎసి)లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు రావాలని గిరిజన ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.ఈ తీర్పు అమలైతే విద్య శాకే కాకుండా 19 శాఖలలో  సుమారు 35 రకరకాల ఉద్యోగలు కు స్థానిక గిరిజనులు కోల్పోతారాని ఆవేదన వ్యక్తంచేశారు. 


      సుప్రీంకోర్టు లో  గిరిజనులకు అనుకూలంగా వాదనలు వినిపించడం లో ప్రభుత్వం వైఫల్యం వల్ల జీవో నెంబర్3 ను కోర్టు కొట్టేసిందాని విమర్శించారు.  విద్య,వైద్య,రాజకీయ, మరియు భూమి పై ఆదివాసుల కు రాజ్యాంగం ద్వారా హక్కులు సంక్రమించిందని అన్నారు.   గిరిజన సంఘం ఈ ఇచ్చిన పిలుపు తో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడం తో గిరిజనులలో తీవ్రంగా అసంతృప్తి ఉందని,సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.          
           రాష్ట్ర ముఖ్యమంత్రి గారి  దృష్టిలో కి జీవో నెంబర్ 3 రద్దు అంశాన్ని తీసుకువెళ్లాలని గిరిజన ప్రజాప్రతినిధుల కు విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రజాప్రతినిధులు చేస్తున్న కృషికి గిరిజన ఉపాద్యాయులు, ఉద్యోగులు సంపూర్ణంగా సహకారానికి సిద్ధంగానే ఉన్నామని గిరిజన ఉపాద్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నిలకంఠం, ప్రధాన ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు శెట్టి పూర్ణ చంద్రరావు అన్నారు. 
ఈ కార్యక్రమంలో యూటీఫ్ డివిజన్ కన్వీనర్ చీకటి నాగేశ్వరరావు,  గిరిజన సంఘం నాయకులు కొర్ర సత్యరావు,మోద శ్రీను,వల్లంగి వెంకటరమణ, నాగేశ్వరరావు గిరిజన ఉపాద్యాయుల సంఘాల నాయకులు బాలన్న తదితరులు పాల్గొన్నారు.