నిత్యావసర సరుకులను డోర్ డెలివరీ చేస్తున్నట్టు బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ తెలిపారు.

చింతపల్లి, ఏప్రిల్ 1 :
విశాఖ ఏజెన్సీ శివారు గిరిజన గ్రామాలకు బిజెపి కార్యకర్తలు లాభాపేక్ష లేకుండా నిత్యావసర సరుకులను డోర్ డెలివరీ చేస్తున్నట్టు బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ తెలిపారు. గురువారం చింతపల్లి , జీకేవీధి మండలాల్లో  బిజెపి కార్యకర్తలు పలు గ్రామాల వద్దకు మినీ వ్యాన్, ఆటో లో కూరగాయలు ఇతర సరుకులను తీసుకుని వెళ్లి ఆదివాసీలకు అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కరోనా  వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా  కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని, దీంతో గిరిజన గ్రామాల్లో ఆదివాసీలను గృహాలకు పరిమితమయ్యారని ఆయన తెలిపారు. వారపు సంతలు కూడా రద్దు చేయడం జరిగిందన్నారు. దీంతో గిరిజనులకు నిత్యావసర సరుకులు అందడం లేదన్నారు. ఈ సమస్యను గుర్తించి ఆదివాసీలకు నిత్యావసర సరుకులు అందజేసేందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. గిరిజన గ్రామాల్లో నున్న కార్యకర్తలు నర్సీపట్నంలో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్ కి ఫోన్ చేసి ఆదివాసీల అవసరాలను తెలియజేయడం జరుగుతుంది అన్నారు. కార్యకర్తలు చేరవేసిన సమాచారం ఆధారంగా నర్సీపట్నంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి మినీ వ్యాన్, ఆటోలో సంబంధిత గ్రామాలకు సరుకులను పంపిస్తున్న మన్నారు. నిత్యావసర సరుకులను నర్సీపట్నంలో కొనుగోలు చేసిన ధరకే గిరిజనులకు అందజేస్తున్న మన్నారు . నిత్యావసర సరుకుల రవాణా ఖర్చులు పార్టీ కార్యకర్తలు భరిస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ విస్తరక్ అనిల్ కుమార్, చింతపల్లి పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు వసుపరి శ్రీనివాసరావు,  ముత్యాల త్రిమూర్తులు పాల్గొన్నారు.