: పసుపు క్రయవిక్రయాలకు మరి కొన్ని  సంతలకు  అనుమతి మంజూరు చేయాలి.            

 తేదీ:16-4-2020.గౌరవ శ్రీయుత కలెక్టర్ గారు.విశాఖపట్నం. 
        
 విషయం: పసుపు క్రయవిక్రయాలకు మరి కొన్ని  సంతలకు  అనుమతి మంజూరు చేయాలి.
         


 విశాఖపట్నం జిల్లా గిరిజన ప్రాంతాల్లో గిరిజన రైతులు సాగుచేస్తున్న పసుపు క్రయవిక్రయాల కోసం  గుత్తుల పుట్ సంతతో పాటు మరి కొన్ని సంతలకు అనుమతి ఇవ్వాలని  కోరుతున్నాము.



        కరోన లాక్ డౌన్ తో గిరిజన రైతులు తీవ్రస్థాయిలో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. నిత్యావసర సరుకులు కొనుకోలేకపోతున్నారు.
గిరిజన సంఘం గ్రామ పర్యటన లో చింతపండు, పసుపు, మిరియాలు క్రయవిక్రయాలు లేక రైతుల ఇబ్బందులను తమ  దృష్టికి గతంలో తీసుకురావడం  జరిగింది.రైతుల ప్రయోజనంకోసం   గుత్తుల పుట్ సంతలో  పసుపు క్రయవిక్రయాల ప్రభుత్వం వారు ఐటీడీఏ ద్వారా అనుమతి మంజూరు చేయడాని గిరిజన సంఘం హర్షం వ్యక్తం చేస్తుంది. గుత్తుల పుట్టు పసుపు క్రయవిక్రయాల కేంద్రాన్ని గిరిజన సంఘం ప్రతినిధులు బృందం నేడు  పరిశీలించింది.
            గుత్తుల పుట్ సంతలో వచ్చిన పసుపు రైతులు కేవలం10 శాతం మాత్రమే. వచ్చే వారం సంతకు  ప్రతి గ్రామంలో దండోరా వేయించి  క్రయవిక్రయాలకు  రైతులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి.సంత కేంద్రంలో పసుపు క్రయవిక్రయాలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని, రైతుల వద్ద ప్రవేటు వ్యాపారులకు కొనుగోలు కు అనుమతి ఇవ్వడం ద్వారా కరోన వ్యాప్తికి అవకాశం ఉంటుంది. పసుపు వ్యాపారులు ఎక్కువ మంది మైదాన ప్రాంతం నుండి వస్తున్నారు.



      విశాఖపట్నం జిల్లా గిరిజన ప్రాంతాల్లో ముంచంగిపుట్టు
పెదబయులు, హుకుంపేట, పాడేరు,జి మాడుగుల లో పసుపు  సాగు చేస్తున్న రైతులు ఎక్కువ మంది  ఉన్నారు.ప్రతి మండలంలోని ఒక్క సంత కేంద్రాలకు క్రయవిక్రయాలకు అనుమతులు మంజూరు చేయాలని గిరిజన రైతుల తరుపున కోరుతున్నాము.
          ప్రభుత్వం ప్రకటించిన పసుపు ధర కేవలం 64 రూపాయిలు మాత్రమేనని,ప్రవేటు వ్యాపారులు 85 రూపాయిలకు కొనుగోలు చేస్తున్నారని,పసుపు రైతులను ఆదుకోవడానికి మద్దతు ధర కేజీకి 100 రూపాయిలను ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నాము.చింతపండు సేకరణ కూడ సంత కేంద్రాలలో అనుమతి ఇవ్వాలి.
★ గుత్తుల పుట్ పసుపు క్రయవిక్రయాల కేంద్రాన్ని పరిశీలించిన గిరిజన సంఘం నాయకులు మోద శ్రీను,సత్యనారాయణ, వల్లంగి వెంకట రమణ, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.