విశాఖమన్యంలోచింతిస్తున్నచింతరైతులు...కరోనా కాటుకి బలౌతున్న చింత ఆశలు

విశాఖమన్యంలోచింతిస్తున్నచింతరైతులు...కరోనా కాటుకి బలౌతున్న చింత ఆశలు


విశాఖ మన్యంలో చింతిస్తున్న చింత రైతులు...కరోనా కాటు కి బలౌతున్న చింత ఆశలు
కొండంత ఆశ అవిరౌతుంది... కొండెక్కి సేకరించిన చింతపండు కడుపుకి కూడు పెట్టలేకపోతుంది...
విశాఖ మన్యంలో సరిగ్గా మార్చి ఏప్రిల్ నెలల్లో చేతికందే చింతపండు ఇక్కడ గిరిజనులకు ఓ వరం లాంటిది, ఏటా ఈ చింతపండు సీజన్ వచ్చిందంటే గిరి పల్లెల్లో పండగ వాతావరణం, గిరిజనుల కళ్ళల్లో ఆనందం ఉట్టిపడుతుంది.. కానీ ఈ కరోనా వైరస్ కారణంగా కన్నీళ్లు వస్తున్నాయంటున్నారు స్థానిక గిరిజనులు, కష్టపడి కొండెక్కి కొండ పై చెట్టెక్కి సేకరించిన చింతపండు కొనే వారు లేక అమ్ముకునే సౌలభ్యం లేక గిరి గ్రామాల్లో మగ్గిపోతుంది.సాధారణంగా సంతల్లోకి కావిడి మోత ద్వారా తీసుకు వచ్చి విక్రయించే ఈ చింతపండు కరోనా కారణంగా సంతలు నిషేధం కావడంతో ఎక్కడికక్కడ చింతపండు నిల్వలు ఉండిపోయాయి. మైదాన ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీలు వంటి ఆధునిక పద్ధతులు వున్నా ఇక్కడ గిరిజనులకు మాత్రం సంతలే కోల్డ్ స్టోరేజీలు,అటువంటి సంతలు లేక ఇంటి ఇంటికి తిరిగి అడిగిన ధరలకు తప్పని పరిస్థితుల్లో అమ్ముకుంటున్నారు..ఇదంతా ఒక ఎత్తైతే అవకాశాన్ని పుష్కలంగా వినియోగించుకుంటున్నారు దళారులు.. తక్కువ ధరలకు గ్రామాల్లోకి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. గిరిజన ఉత్పత్తులు కొనుగోలు చేసే gcc గిట్టుబాటు ధర 30 రూపాయలు ప్రకటించిన అక్కడకి పట్టుకెళ్లే పరిస్థితి లేక గిరి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.. 



చింతపండు కి కనీస మద్దతు ధర కల్పించి గిరిజన గ్రామాల్లోకి నేరుగా వెళ్లి ప్రభుత్వం కొనుగోలు చేసి గిరిజనులను ఆదుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..