తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన అనంతరం విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో గౌ" అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి. మాధవి మరియు పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్ళీ భాగ్యలక్ష్మి *వైఎస్సార్ సున్నావడ్డీ*
ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ
ఒక పక్క కరోనా వైరస్‌తో రాష్ట్ర ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. మరో పక్క కేంద్రం నుంచి వచ్చే నిధులూ తగ్గిపోయాయి.
ఇంకో పక్క పేదలను ఆదుకోవడానికి ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీతో పాటు పేద కుటుంబాలకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పొదుపు సంఘాల అక్క చెల్లమ్మలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అవుతుంది. కాగా, ఇప్పటికే మీ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదేనని పొదుపు సంఘాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలియజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శివ ప్రసాద్ , డాక్టర్ నర్సింగ్ రావు , మండల అధికారులు & వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.