స్వీయ నియంత్రణతో కరోనాని జయిద్దాం
సామాజిక దూరం పాటిద్దాం
వి జె ఎఫ్ లో సానిటైజర్లు.. మాస్కులు పంపిణీ
విశాఖపట్నం
(సిటీ ట్రెండ్ న్యూస్ విశాఖపట్నం)
స్వీయ నియంత్రణతో కరోనా ని కట్టడి చేద్దామని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి పిలుపునిచ్చారు... శనివారం విజేఫ్ వినోద వేదిక లో
జీటీవీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులకు సానిటేజర్లు.. మాస్క్ లు పలువురు చేతులమీదుగా అందజేయడం జరిగింది... ఈ కార్యక్రమంలో డాక్టర్ శాస్ట్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాల ను తప్పకుండా పాటిస్తే సులభంగా కరోనా ని నియంత్రించవచ్చు అన్నారు... దశలవారీగా తన సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తున్న విజేఫ్ సేవలు అభినందనీయమన్నారు...
జీ టీవీ హెల్త్ కేర్ ఎండి దారపు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ
కరోనా సమయంలోఎటువంటి లాభాపేక్ష లేకుండా తమ సంస్థ ప్రజలుకు సేవలందిస్తుంది అన్నారు.. . ఇదే సమయంలో జిల్లా యంత్రాంగానికి తమ వంతు బాధ్యతగా అవసరం అయిన సామాగ్రి అందజేసా మన్నారు...ఇక అనేక ప్రాంతాల్లో తమ సంస్థ సభ్యులు సహాయం అందిస్తున్నారని చెప్పారు.. . సమాజం కోసం పాటుపడే జర్నలిస్టులు కూడా జాగ్రత్త లు పాటించాలి అని కోరారు.. వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే తమ ప్రధాన లక్షమన్నారు.. దశలు వారీగా ఆయా కార్యక్రమం లు చేపడుతున్నమన్నారు.. కార్యదర్శి ఎస్.. దుర్గారావు.. ఉపాద్య్క్షలు నాగరాజు పట్నాయక్... నానాజీ.. మూర్తి.. దాడి రవికుమార్.. కార్యవర్గ సభ్యులు ఈశ్వర్ రావు ఎమ్మెస్సార్ ప్రసాద్ P.దివాకర్ తదితరులు పాల్గొన్నారు.. .