విశాఖ మన్యంలో అరకు ఎమ్మెల్యే  చెట్టి ఫాల్గుణ వినూత్న ప్రయత్నం

 


... అరకు  ఎమ్మెల్యేకి కనిపిస్తే మాస్క్ పెడతారు


విశాఖ మన్యంలో అరకు ఎమ్మెల్యే  చెట్టి ఫాల్గుణ
వినూత్న ప్రయత్నం



....కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక దూరం పాటించడంతో పాటు వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్కులు ధరించాలని వైద్య వర్గాలు ఇప్పటికే చెప్పారు. ఏపీ ప్రభుత్వం కూడా ప్రతి వ్యక్తికి మూడు మా స్కులు  అందించాలని కూడా నిర్ణయించింది. ఇప్పటికే కొందరు మాస్కులు ధరిస్తున్నారు. ఇంకా కొందరికి అవగాహన లేక అందుబాటులో లేక కొన్ని సందర్భాల్లో మాస్కులు లేకుండా బయటకు వస్తున్నారు. అలాంటి వ్యక్తులను గుర్తించి దగ్గరుండి మాస్కులు ధరింపజేసేలా చేస్తున్నారు.


అరకు ఎమ్మెల్యే    చెట్టి ఫాల్గుణ  . పాడేరు లోని తన ఇంటి నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే  ఫాల్గుణ హుకుంపేట డుంబ్రిగూడ అరకు అనంతగిరి వరకు ఉదయాన్నే వెళ్లారు. దారిలో ఎవరైనా గిరిజనులు మాస్కులు లేకుండా కనిపిస్తే వారికి స్వయంగా మాస్క్ పెట్టి ఇ మాస్కులు లేకుండా బయటకు రావద్దని సూచనలు చేశారు.
అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చేపట్టిన ఈ యాత్ర  అభినందనీయం.