ప్రజా సేవయే పరమావధి
పలువురు కి ఆహార పదార్థాలు.. అరటి పండ్లు పంపిణీ
(సిటీ ట్రెండ్ న్యూస్ విశాఖపట్నం)
అక్కయ్యపాలెం
మూవింగ్ మైండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పలువురు ప్రజలకు ఆహార పదార్థాలు .. కాయకూరలు. అరటి పండ్లు .పాలు. . మాస్కులు.. నిత్యావసరాలు అందజేయడం జరిగింది..ఇక్కడ ముస్లిం తాటిచెట్ల పాలెం లో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు జేవీ ప్రభాకర్.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి.. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు..
సంస్థ సభ్యులు
పాల్గొని వీటిని నిరుపేదలకు పంపిణీ చేశారు... ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత 25 రోజులుగాఆహార సామాగ్రి ని క్రమం తప్పకుండా పేద ప్రజలకు అందిస్తున్నామన్నారు... పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా తమ పౌండేషన్ పని చేస్తూ 0దన్నారు .ఈ కార్యక్రమం లో గంట్ల శ్రీనుబాబు మాట్లడుతూ కరోనా ను క్రమశిక్షణ తో కట్టుదిట్టము చేసువచ్చునని చెప్పారు.. సేవలకు ఇదే సరైన సమయం అన్నారు.తాను కూడా జర్నలిస్ట్ ల కు కొంత మేరకు సామాగ్రి ని అందచేశామన్నారు.. . ఈ సమయం లో ప్రతీ ఒక్కరూ తమ వంతు బాధ్యత గా సేవలు అందిస్తున్నారు అని.. వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు చెప్పారు..ఆయా కార్యక్రమంల లో జేవీ పృథ్వి.. రాజకుమారి.. తేజ.. సలీం.. భార్గవి ఎనక్లేవ్ సభ్యులు నీలయ్య. సీతారామయ్య.. అప్పారావు.. తదితరులు పాల్గున్నారు..