తేదీ :-08-04-2020 ,..పాడేరు.
ప్రభుత్వ కనీస మద్దతు ధర ప్రకటించి- ప్రతి మండలంలో 3 లేదా 4 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి-పసుపు చింతపండు రైతులను ఆదుకోవాలి అని పాడేరు పీఓ మరియు జి.సీ.సీ ఎండీ సూచించిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.
గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా పండించిన పంటలో చింతపండు మరియు పసుపు అధికము అన విషయం మీకు తెలిసినదే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ వలన గిరిజన ప్రాంతంలో పండించిన పంటలు కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. పండించిన పంటలు అమ్మకానికి నోచుకోవడం లేదని గిరిజన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కాబట్టి గిరిజన రైతులు పండించిన పంటను అమ్ముకునే వెసులుబాటు కల్పించి. ముఖ్యంగా గిరిజన ప్రాంత రైతులు ఈ పంటల పై వచ్చే ఆదాయము మీద ఆధారపడి ఏడాదిపాటు జీవన విధానం కొనసాగిస్తూ ఉంటారు. ఈ సమయంలో వారు వీటిని అమ్ముకో లేకపోతే రానున్న రోజుల్లో వాటి నాణ్యత మరింత తగ్గి కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కని పరిస్థితి లోకి వెళ్తారు. కావున జి.సీ.సీ ముందుకొచ్చి పాడేరు ఐ.టి.డి.ఎ పరిధిలో ఉన్న ప్రతి మండలంలో 3 లేదా 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు అమ్ముకునే వెసులుబాటు కల్పించి. చింతపండు మరియు పసుపుకి ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించి . ఏ రైతు కూడా నష్టం వాటిల్లకుండా ఆదుకోవాలని కోరుతున్నాను.
*ఈ మేరకు ఐటీడీఏ పాడేరు ప్రాజెక్ట్ ఆఫీసర్ తో మరియు జిసిసి ఎండి తో చరవాణి సంభాషించి లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఇద్దరు అధికారులు తప్పకుండా గిరిజన రైతులను ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది*