విశాఖ అనుమాన స్పంద స్థితిలో మహిళ మృతి ...

(సిటీ ట్రెండ్ న్యూస్ reporter:B.santosh kumar)


అనుమాన స్పంద స్థితిలో మహిళ మృతి ....



అనుమాన స్పంద స్థితిలో మహిళ ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడ్డ ఘటన జీవీఎంసీ 53 వ వార్డు పరిది  మర్రిపాలెం మహారాణీ వీధి లో చోటు చేసుకుంది .  ఘటన కు సంబందించి పశ్చిమ జోన్ ఏసిపి జి.స్వరూపారాణి తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి . మర్రిపాలెం మహారాణీ వీధి ప్రాంతానికి చెందిన ముప్పిడి గౌరీ ప్రసాద్ ( న్యాయవాది )  విజయనగం జిల్లా  పార్వతీ పురం సివిడి గ్రామం కి చెందిన స్వరూపా రాణి ( 27 ) రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది . విరికి 10 నెలల కుమార్తె  ఉంది   . బిటెక్ పూర్తి చేసిన స్వరూపా రాణి ప్రయివేట్ సంస్థలో విదులు నిర్వహిస్తుంది . ఇదిలా వుండగా బుదవారం సాయంత్రం మర్రిపాలెం మహారాణీ వీధి ఇంట్లో ఉరి వేసుకొని అత్మ హత్యకు పాల్పడటంతో అత్త కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకు వెళ్లారు . అప్పటికే ఆమే మృతిచెందిందని వైద్యులు చెప్పడంతో మృతదేహన్ని కెజిహెచ్ కు తరలించారు . అయితే తమ కుమార్తెను గత సంవత్సరం నుండి అదనపు కట్నం కావలని వేదింపులకు గురిచేస్తున్నారని 



ఈక్రమంలో  అత్త ఇంటివారు తమకుమార్తె అత్మహత్యకు పాల్పడిందని సమాచారమిచ్చారని ఆత్మహతపై అనుమానం వ్యక్తం చేస్తూ  స్వరూపా రాణి  తండ్రి యమాల బసవన్న గురువారం ఉదయం ఎయిర్ పోర్ట్ పోలీసు లకు పిర్యాదు చేయడంతో పశ్చిమ జోన్ ఏసిపి జి.స్వరూపారాణి నేరుగా ఘటన స్థలానికి చేరుకొని దర్యాఫ్తు చేపట్టారు .
పిర్యాదు మేరకు మృతురాలి భర్త ముప్పిడి గౌరీ ప్రసాద్ తో పాటుగా అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని  సెక్షన్ 304 "బి " క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు  స్థానికుల వద్ద వివరాలు సేకరించి పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా చర్యలు చేపడుతామని తెలియజేసారు ...