హుకుంపేట మండలం... తీగలవలస పంచాయతీ...కిన్నెర్లోవ గ్రామానికి సంబంధించిన
*"వాలంటీరు" కిల్లో సీమన్న.*
జగన్మోహనరెడ్డి గారు కన్న కలలను నిజం చేస్తా ఉన్నాడు. పేద గిరిజన కుటుంభీకుడై ఆయా గిరిజన కుటుంభాలకు ప్రభుత్వం వారు అందించేటటువంటి ఫ్రీ రేషను...సరుకులు...
రవాణా సదుపాయం లేక గుర్రాలపై తీసుకుని వెళ్ళి నిష్కల్మషంగా అందిస్తూ చాలా కష్టపడుతున్నాడు ఆదర్శంగా నిలబడుతున్నాడు. వారి గ్రామానికి మాప్రభుత్వ హయాంలో తారురోడ్డు సేంక్షన్ యివ్వడం జరిగింది పనులు కొనసాగుతుండగా కరోనా వలన పనులు నిలచిపోయినట్లు సమాచారం.
వారి గ్రామానికి సంబందించి మూడు కుటుంభాలకు రేషను అందటం లేదని మా దృష్టికి తీసుకుని వచ్చారు... వారికి కూడా తప్పకుండా రేషను మరియూ 1000/- సహాయం అందించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాం.ఆ కుటుంబాల వివరాలు తీసుకుని రేషను కార్డు కొరకు దరఖాస్తు చేయమని చెప్పటం కూడా జరిగింది.
*ఇలా నిష్కల్మషంగా నిజాయతీగా పనిచేసే వాలంటీరు మరియూ ఉద్యోగుల సేవలను మా పార్టీ నాయకులు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం వారికి అండగా ఉంటాం...*
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కావలసిన
అన్ని సౌకర్యాలను అందించటానికి ఎల్లవేలలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూవున్నాను.
*మీ కూడా.సురేష్ కుమార్*
*అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి*
*వైయస్సార్సీపీ.,పాడేరు*