ఈరోజు అరకు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి గొడ్డేటి. మాధవి పాలకొండ పర్యటన
పాలకొండ పట్టణ వీధుల్లో పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు అందులో భాగంగా పట్టణ వీధుల్లో హైపోక్లోరైట్ పిచికారీ చేశారు.
ఇటీవలే ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన నిర్వాసితులను క్వారంటినే సెంటర్కి తరలించడం జరిగింది.
క్వారంటినే సెంటర్లో ఏర్పాటుచేసిన సేవలను మరియు వారికి అందుతున్న పౌష్టిక ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు .
వారిలో ఇటీవల ఓ పాపకు జన్మించిన మహిళలకు ఖర్చుల నిమిత్తం ఎంపీ గారు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు .
*అక్కడ నుంచి సీతంపేట ఐటిడిఎ పరిధిలోని*
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరము వైద్య సిబ్బందికి మాస్క్ మరియు శానిటైజర్లు పంపిణీ చేశారు.
చిన్నారులకు పలకలు పంపిణీ చేశారు.
తర్వాత భామిని గ్రామాన్ని సందర్శించి*
గ్రామ ప్రజలకు కరోనా వైరస్ మీద అవగాహన కల్పించారు.
భామిని గ్రామస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
పాత్రికేయ మిత్రులతో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో *అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి. మాధవి* , పాలకొండ శాసనసభ్యులు *విశ్వసరాయి కళావతి* డిసిసిబి చైర్మన్ *విక్రమ్ క్రాంత్* , భర్త *శివప్రసాద్* , వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.