మారుమూలగ్రామాల్లోనిత్యావసరసరుకులుపంపిణీచేసిన పోలీసులు...
(సిటీట్రెండ్ న్యూస్ -మన పాడేరు) పెదబయలు మండలంలో మారుమూల ప్రాంతమైన పరెడ పంచాయతీ అంబ పడగ్రామంలో 36 ఆదివాసి (పి టి జి )కుటుంబాలకు. మంగళవారం స్థానిక ఎస్ఐ పి. రాజారావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు లాక్ డౌన్ నేపద్యంలో మండల కేంద్రంలో గాని మార్కెట్లో గాని వెళ్లి ఎటువంటి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి కోలేని అమాయక ప్రజలకు అండగా ఉండాలని దృక్పథంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పర్రెడపంచాయతీ అంబ పడ గ్రామంలో లో ఉదయం 10 గంటలకు మోటర్ బైక్ పై గ్రామానికి చేరుకొని ఇంటింటికి వెళ్లి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకుఆదివాసీ మహిళలకు వృద్ధ ఒంటరి మహిళలకు పది కేజీల బిపి టి బియ్యం పప్పు నూనె మిల్మేకర్ ఉప్పు కారం గ్రామ వాలంటీర్ సహకారంతో పంపిణీ చేశారు లాక్ డౌన్ నే పద్యంలో లో ఇళ్ల నుండి ఎవరు బయటికి పోవద్దని కుటుంబ అవసరాల నిమిత్తం ఇంటి నుండి ఒక్కరే బయటికి పోయి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలని ప్రతి రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గడియ గడియకు కాళ్లు చేతులు శుభ్రపరచుకోవాలి అని పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఒక ఇంటి నుండి మరొక ఇంటికి ఎవరు వెళ్లరాదని ఎటువంటి అనారోగ్యం గురిచేసిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి అన్నారు
గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు..