ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ)గా
*ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమీషనర్ గా జస్టిస్ కనగరాజ్
నియమితులయ్యారు.
శనివారం ఉదయం ఆయన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. కనగరాజ్ ద మద్రాస్ లా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1973లో మద్రాస్ బార్ కౌన్సిల్ సభ్యత్వం పొందారు.. 1997లో మద్రసా్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. తర్వాత మద్రాస్ హైకోర్టు, మధురై బెంచ్‌లకు న్యాయమూర్తిగా సేవలు అందించారు. జడ్జిగా దాదాపు తొమ్మిదేళ్లు పనిచేశారు.
ఏపీ ఎన్నికల కమిషనర్ : నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు జగన్ సర్కారు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్ ద్వారా ఆయన్ను పదవి నుంచి తెలివిగా తప్పించింది. కానీ ఎక్కడా నిమ్మగడ్డను పదవి నుంచి తప్పిస్తున్నామన్న ప్రస్తావన తీసుకు రాకుండానే ఈ వ్యవహారాన్ని పూర్తి చేసింది. కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో తెలివిగా వ్యవహరించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా నియమించేలా చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారమే కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించారు.
రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీకాలం, జీతభత్యాల నియమ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నియమింపబడేందుకు అర్హుడు.. ఎన్నికల కమీషనర్ పదవీకాలం మూడేళ్లు ఉండాలని, గరిష్టంగా రెండు పర్యాయాలు (ఆరేళ్లు) పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషనర్‌కు హైకోర్టు న్యాయమూర్తి స్థాయి హోదా లభిస్తుంది.. హైకోర్టు జడ్జెస్ యాక్ట్ 1954 ప్రకారం అలవెన్స్‌లు, జీత భత్యాలు