విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా అంబులెన్స్ డ్రైవర్‌.

 


విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా అంబులెన్స్ డ్రైవర్‌.


ఉద్యోగంలో నిబంధనలను ఉల్లంఘించిన అంబులెన్స్ డ్రైవర్‌కు ఐటీడీఏ పీవో డీకే బాలాజీ షాకిచ్చారు. 


తక్షణమే డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. 


ఈ మేరకు ఉద్యోగం నుంచి డ్రైవర్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 


ముంచుంగిపుట్టుకు నలుగురు ప్రయాణికులను అంబులెన్స్‌లో తీసుకువచ్చినట్లు అంబులెన్స్ డ్రైవర్‌పై ఆరోపణలొచ్చాయి.


దర్యాప్తు నిర్వహించగా అది నిజమేనని తేలింది. 


దీంతో డ్రైవర్‌ను ఐటీడీఏ పీవో విధుల నుంచి తొలగించారు.


అనంతరం అంబులెన్స్‌లో ప్రయాణించిన నలుగురు ప్రయాణికులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.